కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 5

కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 1 & 2

కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 3

కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 4


పోయిన ఏడాది, తిరుపతికి వెళ్లి, అక్కడ నుండి, కాలినడకన తిరుమల వెళుతుంటే, ఒక కుటుంబము కనపడినది. వారి మాటలు చూస్తుంటే, వారు హిందువు లాగ లేరు. ఆత్రుత ఆపుకోలేక వారి వివరాలు, అడిగితె , వారు ముస్లిములు అని, వారు తరచూ తిరుమల కాలినడకన వెళ్లి స్వామి వారి దర్శనము చేసుకుంటారని చెప్పినారు.

అలాగే, బహుసా నాలుగు సంవత్సరాల క్రితము ఆనుకున, ఇండియా లో మినీ వరల్డ్ కప్ జరిగినప్పడు, పాకిస్తాన్ జట్టు, రాజస్తాన్ లోని ఒక దర్గా కు వెళ్లి, వారి గెలుపు కొరకు ప్రార్ధించమని అక్కడి దర్గా వారిని అడిగితె, వారు, పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటే అది తమ మాత్రు దేశమయిన భారత దేశానికి ద్రోహము చేసినట్లని, కనుక తము పాకిస్తాన్ గెలుపుకి ప్రార్ధించ లేమని చెప్పినారు.

Comments