Friday, March 23, 2012

ఉగాది శుభాకాంక్షలు

అందరికి నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Friday, March 16, 2012

బడ్జెట్ Vs సచిన్ సెంచురీ

బడ్జెట్ Vs సచిన్ సెంచురీ

సనిచ్ సెంచురీ కొరకు దేవుణ్ణి ప్రార్దిస్తుంటే, ఆఫీసు లో కొలీగు వచ్చి బడ్జెట్ లో ఉద్యోగస్తులకు కొద్ది గా పన్ను రాయితీ ఇచ్చారు తెలుసా అని అడిగినాడు. అసలే సచిన్ సెంచురీ టెన్షన్.

ఆయన గారు ఇచ్చే పన్ను రాయితీ మీద ఇంటరెస్ట్ లేదు అన్నాను.

'ఎం' అని అడిగినాడు.

'ఒక చేతితో ఇచ్చి మరొక చేతితో దోచు కోవడము వాళ్లకు అలవాటే. కానిసం, సచిన్ సెంచరి చేస్తే ఒక రకమయిన ఆనందము అనుభూతి కలుగు తాయి. మా లాంటి క్రికెట్ ప్రేమికులకి ఈ ఆనందము పొందడం వర్ణనాతీతము' అన్నాను.

రేపు వార్తా పత్రికలలో నేను చూసేది కూడా నేను ముందుగా చూసేది క్రీడ పేజి మాత్రమె.

Tuesday, March 13, 2012

మనోళ్ళు ఫాం లోకి వచ్చారోచ్

ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా లలో బ్యాట్లు ఎత్తేసిన మన గ్రేట్ బాట్స్ మాన్ లు, ఉప ఖండపు పిచ్ ల మీద రెచ్చి పోవడం మొదలు పెట్టేసారు. ఎలాగో మరొక సంవత్సరం పాటు మనోళ్ళు ఉపద ఖండపు పిచ్ ల మీదే ఆడతారు కనుక, మనము హై స్కోరింగ్ మ్యాచ్ లు చూడవచ్చు.

వీరిని చూస్తుంటే ఏమి అనిపిస్తుంది అంటే, వీళ్ళని జాతీయ రహ దారిమీద వదిలేసి కారు నడుపుకుంటూ పొండ్రా అంటే 'రయ్యి' మంటూ పోతారు. ఎదురు గా ఎవరు రారు కదా...

వాళ్ళనే, మన హైదరాబాద్ ట్రాఫిక్ లో నడప మంటే వీళ్ళకి కాళ్ళు చేతులు వణుకుతాయి.

పెద్దోళ్ళు ఏమి చేసిన చెల్లు తుంది


ఈ మధ్య ఒక వెబ్ సైట్ లో, త్వరలో రాబోతున్న దమ్ము సినిమాలో ఒక డయలాగ్ చూసా.

హీరో తో పెట్టుకుంటే క్రైం రేటు పెరిగి పోతుందట.

మొన్న ఈ మధ్యనే, ఒక హీరో ముంబై ని ఉచ్చ పోయిన్చాదాని కి వచ్చాడట.

అవును మరి వీళ్ళు పెద్దోలు, ఏమి అన్న చెల్లుతుంది. 'అన్న' ఏమిటి, ఏమి 'చేసిన' చెల్లుతుంది.
ఎవరి మీద అయినా కోపం ఉంటె, వారని తుపాకి పెట్టి కాల్చినా ఏమి కాదు.

అందుకనే, సీరియల్స్ బాధితుడు అయిన ఒక స్నేహితుడు, సదరు హీరో గారి చేతిలో తుపాకి పెట్టి తనకు కోపం ఉన్న వారిని అందరిని కాల్చడానికి బేరం కుదుర్చు కుంటాను అన్నాడు.

Monday, January 16, 2012

సినిమా హిట్టు అవ్వాలంటే బూతు కావల?


ఈ మధ్యనే విడుదల అయ్యిన ఒక పెద్ద హీరో సినిమాలో బూతు కూడా ఉన్నదని తెలిసినది. ఆ హీరో గారు చిన్న చిన్న 'పంచ్' డయలాగులు చెప్పడము లో దిట్ట. ఆయన గారు, గత చిత్రానికి ముందు చిత్రములో కూడా బూతులు అవలీలగా చెప్పారు. ఆ సినిమాను చూసిన మా అమ్మాయి పొరపాటున ఆ బూతు లు మాట్లాడితే ?


దయ చేసి ఇప్పుడు ఆయన అభిమానులు 'బూతు' ని నిర్వచించమని అడగ వద్దు. మీ ఇంటిలోని వారిని అడగండి.

Saturday, January 14, 2012

వీళ్ళు మారరు

ఒక క్రికెట్ అభిమానిగా, ఇంకా ఎన్నిరోజులు ఈ అభిమానులకు ఈ ఆశభంగమో?


ఎన్ని సార్లు విదేశి సిరీస్ లకు వెళ్ళినా, మన ప్రపంచ ప్రఖ్యాత బాట్స్ మాన్ లు చేతులు ఎత్తేస్తారు, పాపం బౌలర్లు కస్టపడి ప్రత్యర్థి జట్టుని అల్ అవుట్ చేస్తారు. సగటు క్రికెట్ అభిమానిగా మళ్లీ మన ఆశ. రెండవ ఇన్నింగ్స్ లో అయిన మన ప్రపంచ ప్రఖ్యాత బాట్స్ మాన్ లు విరుచుకు పడక పోతార అని మళ్లీ చిన్న ఆస. కానీ ఎం లాభం. వారిది పాత బాటే.

ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ మీద రెచ్చి పోయే వీరు, విదేశాలలో మాత్రం పిల్లులు అవుతారు. అవును లే మన జట్టుకు 'కాగితం పులి' అని ఎలాగా పేరు ఉన్నదిగా.

ఎం చేస్తాం, వారు బాగా ఆడినప్పుడు అనదపడటం, లేనప్పుడు వారిని తిట్టడం మాకు మాములే.

ఇక్కడ బాధ కలిగే విషయం ఏమిటంటే, బాట్స్ మాన్ లతో చావా బాదించుకుని, వీలు చేక్కినప్పుడు మన జట్టుని తిరిగి పోటిలోనికి తీసుకోని వచ్చే బౌలర్లకి లేని విలువ, ఒక అర్ధ సెంచరీని గాని, సెంచరి గాని చేస్తే బ్యాట్స్ మాన్ లని మన నెత్తిని పెట్టుకుంటాం. బ్యాట్స్ మాన్ కి వచ్చే ఆదాయం బౌలర్ల కి రాదు.

అది మన క్రికెట్ దౌర్భాగ్యం. మనకి బ్యాట్స్ మాన్ లే దేవుళ్ళు.

Thursday, December 22, 2011

మంచి మాట - 1

మంచి మాట - 1

ఈ మధ్య ఓకే ఈమెయిలు వచ్చినది. దాని తెలుగు అనువాదమే ఇది.

ఓకే వ్యకి, ఓకే auditorium ఒక జోక్ చెప్పాడు. అందరు దానికి విరగబడి నవ్వారు.

అదే జోక్ మళ్లీ చెప్పినాడు. ఇప్పుడు కొంతమంది మాత్రమె నవ్వారు.

అదే జోక్ మళ్లీ చెప్పినాడు. ఈ సారి ఎవ్వరు నవ్వలేదు.

కారణము మీకు అర్థము అయ్యే ఉంటుంది.

ఒక జోక్ కి ఒకే సారి నవ్వు వచ్చనప్పుడు, ఎప్పుడయినా బాధ కలిగితే ఒకే సారి బాధ పడాలి గాని, ఆ బాధని తలుచుకుంటూ మళ్లీ మళ్లీ బాధ పడాలి? ఆలోచించండి.