భారత చరిత్ర

భారత చరిత్ర
బ్రిటిష్ వాళ్ళు 17 శతాబ్దంలో భారతదేశంలోని భాషలు, సంస్కృతీ సంప్రదాయాలపై అధ్యయనం చేయడానికి (పరిపాలనా సౌలభ్యం కోసం) కలకత్తాలో ఒక సంస్థను ఏర్పాటు చేసారు. విశేష కృషి చేసి భారతదేశ చరిత్రను తవ్వి నిజాలను వెలికి తీసారు. కానీ నిజాలను బయటికి పోక్కనీయకుండా జాగ్రత్త పడి బూటకపు కథలు ప్రచారం చేసారు.
క్రీ.పూ. 3000 సంవత్సరాల క్రితం సిందు నది లోయ ప్రాంతంలో గొప్ప నాగరికత విలసిల్లినది అనే విషయం వాళ్ళు దాచినా దాగని నిజం. అయితే ఎక్కడినుంచో వచ్చి సిందు ప్రజలపై ఆర్యులు దాడి చేయడం వల్ల సింధు నాగరికత అంతరించిందనేది పచ్చి అబద్దం.
హరప్పా, మొహంజొదారో నగరాలపై దాడులు జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఎటువంటి యుద్ద పరికరాలు కానీ, నిర్మాణాలపై డామేజ్ చేసిన ఆనవాళ్ళు కానీ బయటపడలేదు. దాడివల్ల మరణించిన ఆస్థిపంజరాలు నగరంలో లేదా పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లభించలేదు. అంతే కాకుండా అదే కాలానికి చెందిన హోమ కుండాలు, యజ్ఞ వాటికలు ఇంద్రుని, సూర్యుని ఆరాధించిన అనవ్వాళ్ళు లభించాయి.
బ్రిటిష్ చరిత్రకారుల ప్రచారాల ప్రకారం యజ్ఞ యాగాలు నిర్వహించింది ఆర్యులు. వారు క్రీ. పూ. 1500 లో భారతదేశంలోకి అడుగిడిన ఆర్యులు క్రీ. పూ. 3000లో భారత దేశ వ్యాప్తంగా యజ్ఞ యాగాదులు ఎలా నిర్వహించారు?
సింధు నాగరికత అని బ్రిటిష్ వారు వేరు చేసి చెప్పిన నాగరికత కరువు పరిస్థితుల వల్ల అంతమయింది. వీరు కాలంలో సరస్వతి నది అనే ఒక నది ఉండేది. నది నెమ్మదిగా తన దిశ మార్చుకుంది (నదులు దిశ మార్చుకుంటాయి.). క్రమేపి అంతిరిచిపోయింది. అందువల్ల నీటి సౌకర్యం లేక నగరాలను వదిలి వలసలు వెళ్లారు. ఉన్న ఊరు కట్టుకున్న ఇల్లు విడిచి వెళ్ళలేని కొద్దిమంది సెంటిమెంట్ కొద్ది అక్కడే ఉండి మరణించారు. అలా సిందు నాగరికత అంతమయింది. విషయం ఋగ్వేదంలో వివరంగా ఉంది.
కానీ బ్రిటిష్ వారు చెప్పినదాని ప్రకారం ఆర్యులు భారతదేశంలోకి ప్రవేశించాక క్రీ. పూ. 1500లో ఋగ్వేదాన్ని రచించారు. క్రీ. పూ. 1500 లలో గ్రంధం అయితే, క్రీ. పూ. 3000 సంవత్సరాల క్రిందటి సరస్వతి నదికి సంబంధించిన ప్రస్తావన రుగ్వేదంలో ఎలా వచ్చి చేరింది?
ఆర్యులు వచ్చేసరికి సింధు నదీలోయ ప్రాంతంలో నల్లని, పొట్టివారు ఉండేవారు, వారిని ఆర్యులు "దశ్యులు" , అనాగరికులు అనేవారు అని బ్రిటిష్ వాళ్ళు ప్రచారం చేసారు . వారే (దశ్యులే) భారత "మూల పురుషులు" అని తప్పుడు ప్రచారాలు చేసారు. సిందు ప్రజలు అనాగరికులు అయితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాగరికత ఎలా అయింది?
కానీ పర్షియన్లు సిందు ప్రజలనుండి వచ్చిన చీలిక. వీరు సింధు ప్రజలతో విభేదించి పర్షియా ప్రాంతానికి వలస వెళ్లారు. వారు స్థాపించుకున్న మతం "జోరాస్ట్రియన్" మతం. వాళ్ళ మత గ్రంధం "జెండావెస్తా" లో విషయం వివరంగా ఉంటుంది. అంటే వీళ్ళని (పర్శియన్లని) "దశ్యులు" అని గ్రంధం తెలియ చేస్తుంది. మరి పర్షియన్లు "నల్లగా పొట్టిగా ఉండరు. ఎర్రగా ఎత్తుగానే ఉంటారు".
ఇప్పుడు భారత దేశానికి " మూల పురుషులు ఎవరు? బయటినుంచి వచ్చి ఎవరు దాడులు చేసారు?
బ్రిటిష్ వాళ్ళు కొన్ని సామజిక వర్గాల వారిని రెచ్చగొట్టి చీలికలు తీసుకువచ్చేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసారు.
ఇకపోతే దేశంలో అధికారం చెలాయిస్తున్నవారు బయటినుంచి వచ్చిన వలసవారు అని, దేశంలో వారికెంత హక్కు ఉందో వాళ్ళలా వలస వచ్చిన మాకు కూడా అంత హక్కు ఉంది అని ప్రచారం చేయడం కోసం భారత దేశ ఘన చరిత్రలోని నిజాలను తుంగలో తొక్కారు.

Comments