కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 1 & 2

కాంగ్రెస్, , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 1
ముందుగా ఓకే మాట, ఇక్కడ పేర్కొన్న విషయాలు అన్ని నా అనుభవాలు మాత్రమె. ఎవరిని నొప్పించడానికి కాదు


1990: ఒక రోజు టీవీ చూస్తుండగా, సుష్మ స్వరజ్ యొక్క స్పీచ్ వినడము జరిగినది. అందులో , ఆమె, ముస్లిమ్స్ ని ఉటంకిస్తూ ఒక మాట అన్నారు "భరత దేశం లో ఉంటూ, భారత దేశం క్రికెట్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయినప్పుడు, పండగ చేసుకునే వారిని ఏమి అనాలి అని"

టీనేజి లో ఉన్న నేను దానిని నమ్మలేదు, ఈవిడ, హిందూ, ముస్లిములు మధ్య విభేదాలు సృస్తినచడానికి చూస్తున్నారు అనుకునాను.

కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 2




1994 లో కంప్యూటర్స్ లో డిగ్రీ చేయడానికి విజయవాడ లో చాలామది స్నేహితులు కలిసినారు. అందులో ముగ్గురు ముస్లిములు కూడా ఉన్నారు. ఒక రోజు కనక దుర్గ ఆలయానికి వెళుతుంటే , వారిలో ఇద్దరు నాతొ పాటు కనక దుర్గ ఆలయానికి వచ్చారు. దారిలో వారు తమ స్నేహితులతో అమ్మవారి గుడికి వెళతామని, దీపావళి కి కూడా బాణా సాంచ కాలుస్తామని చెప్పినారు. అది విన్న తరువాత, సుష్మ స్వరాజ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చినవి.

కొన్ని రోజులకు భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆటుంటే, ముగ్గురిలో ఒకడు, పాకిస్తాన్ గెలుస్తుందని పందెం కాసినాడు. ఇప్పుడు సుష్మ స్వరాజ్ మాటలు నమ్మక తప్పలేదు. కానీ అందరు ఒకలాగా లేరు ఉండరు.


Comments