రాజశేఖర్ 'జీవిత' చరిత్ర

రాజశేఖర్ - జీవిత లు తెలుగు దేం పార్టీ లోనికి చేరపోతున్నట్లు వార్తలు వచ్చినవి. డేట్ కూడా నిర్ణయించ పడినదట.

1995 లో, ఈ ఆదర్శ దంపతులు స్వర్గీయ NTR గారికి సపోర్టు చేసినారు. NTR గారిని బాబు గారు వెన్నుపోటు పొడిచి(?) తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు, NTR విజయవాడ వచ్చినారు. ఆయనతో పాటు రాజశేఖర్ కూడా వచ్చినారు. తన అరవ తెలుగు యాస లో NTR కి సుప్పోర్టు చేయమని, బాబు గారిని తిడుతూ మాట్లాడినారు.

తరువాత కొంతకాలం వారు రాజకీయాల జోలికి వచ్చి నట్లు తెలియదు. చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి వార్తలు మొదలు పెట్టిన తరువాత, చిరంజీవి మీద వున్నా తమ కూపం, ఈర్ష్య, అసూయా (?) తీర్చు కూవడానికి, క్రమము తప్పకుండ, ఏదో ఒక పనికి మాలిన వార్తా చానల్ (మా దృష్టిలో) లో రావడము, చిరు ని తిట్టడము చేసేవారు.

ఈ విధముగా కొంతకాలం కాంగ్రెస్ లో ఉంటూ తాము peదడ లీడర్ లు అని ఫీల్ అయ్యిపోయినారు. చిరంజీవిని ఫ్రీ గ తిట్టడానికి ఒకరు దొరికినారు కనుక, కొన్ని రోజులు వారిని కాంగ్రెస్ వారు వారిని భారించినారు. కానీ, అక్కడ వారు స్రుతి మించడము తో వారిని పక్కకు నేట్టినారు. ఈ లోపు YSR చనిపోవడము తో, వారు జగన్ వైపు చేరినారు. అప్పటి ముఖ్య మంత్రి రోశయ్య గారిని 'శని' అని కూడా సంభోదించి, జగన్ దగ్గర క్రెడిట్ కొట్టేయాలి అనుకున్నారు.

ఇప్పుడు జగన్ వారిని 'ఛి' కొట్టదముతో , ఆ దంపతులు, ఇప్పుడు బాబు గారి ని పొగుడుతు, తెలుగు దేశం లోనికి చేరుతున్నారు. బాబు ని తిట్టిన విషయము మరిచి పోయినారు(రాజకీయాలలో ఇది సర్వ సాధారణము). తెలుగు దేశం లో , రోజా లేక పోవడము తో, జనాల మీదకి దూకడానికి, రెచ్చి పోయి నోటికి వచ్చినట్లు పేలడానికి ఒకరు కావాలి. ఆ పోస్టు కి జీవిత సరిపోతుంది

కానీ ఒక్కటి మాత్రము వారికి లాభము, వీరు ఎ పార్టీ లోనికి అయిన వెళ్ళవచ్చు, అన్ని పార్టీలు వీరిని స్వాగతిస్తాయి ఎందుకంటే వారికి, చిరంజీవిని తిట్టడానికి ఫ్రీ గా పనిచేసే ఇద్దురు దొరుకుతారు

Comments

  1. Why they are cursing చిరంజీవిని? What చిరంజీవి did to them? post the information.

    ReplyDelete
  2. why they are cursing...? well they know better and if you want to know they follow all the interviews given by them u will get to know

    ReplyDelete

Post a Comment