టీవీ 9 తో ఆడుకున్న రామ్ గోపాల్ వర్మ

టీవీ 9  తో ఆడుకున్న రామ్ గోపాల్ వర్మ

ముందుగ ఒక విషయము చెప్పాలి. మీము టీవీ  9 కార్యకరామములు చూసి ఇంచుమించు మూడు సంవత్సరములు అయ్యినది. వారు చేసే ఓవర్ ఆక్షన్ తట్టుకోలేక పోతున్నాము.

అలాగని, వర్మ అంటే కూడా మాకు సదభిప్రయము లేదు.

నిన్న అనుకోకుండా చానల్స్ మారుస్తుండగా వర్మ, రజినీకాంత్ ల మధ్య వాగ్విద్వం నడుస్తుంది. ఏమిటో చూద్దామని ఒక రెండు నిముషాలు చూడడం జరిగినది. వర్మ, రజినీకాంత్ గాలి తప్పక తీస్తాడన్నా నమ్మకము కార్యక్రము మొత్తము చూసాము.

నిజంగా రజినీకాంత్ అడిగిన పిచ్చి ప్రశ్నలకు వర్మ చెప్పు తో కొట్టినట్లు సమాధానము చెప్పినారు. అయినా, రజినీకాంత్ వేసిన ప్రశ్ననే తిప్పి తిప్పి వేసి వర్మను ఇబ్బంది పెట్టె ప్రయత్నమూ చేసినా వర్మ మాత్రమూ వెటకారము గా సమాధానము చెప్పారు.

వర్మ ఎలాటి సినిమాలు తియ్యాలో టీవీ 9 వారు చెప్పు తారట మిగిలిన వారు తీయలాట. వీరు చెప్పే చెత్త వార్తలు కొంతమంది పిచ్చి ప్రజలు వేదం లాగ చూస్తారని, అందరు అలాగే చెయాల?

ఎ దర్శకుడైన ప్లాపు సినిమా తీయాలని కోరికోడు. కాని టీవీ 9 వారికీ మంచి సినిమాలు , హిట్టు అయ్యే సినిమాలు తీయలాట. వీరే ఆ సినిమాలు ఏవో తీయకూడదు? లేదా ఆ స్టోరీలు మీరు దర్శకులకు చెప్పండి. సినిమా ఎలాగా తీయాలో, ఏమిచేయాలో. పాపం నిర్మాతలకు డబ్బులు అయిన వస్తాయి.


వర్మ సినిమాలో హింస ఎక్కువగా ఉంటుందట. అవును మరి, ఏ టీవీ లో అయిన ఇప్పటివరకు హింసాత్మక కార్యక్రమాలు చూపించార ఏమిటి?

టీవీ  9 కి, రజినీకాంత్ కి సామాజిక భయత ఉన్నాడట(?) , కాబట్టి వర్మ కూడా సామాజిక భాద్యతతో సినిమాలు తీయాలత. వీరికి ఉన్న సామాజిక భాద్యత ఏమిటో చాలామందికి తెలుసు. వీరు పక్కవారికి నీతులు చెప్పుతున్నారు. సినిమా తీయాలి అనుకున్నవారు వార్కి నచ్చిన సినిమాలు తీస్తారు , చూడలనుకున్నవారు చూస్తారు లేని వారు లేదు. ఎవరు ఏ సినిమాలు తీయాలి అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. click here

కాని, వర్మ చెప్పిన సమాధానాలకు రజనీకాంత్ ముఖము మాత్రము చాలాసారులు చిన్నబోయినది.

మీ చేతిలో టీవీ ఉన్నదని మీరు ఏమి చెప్పిన చెల్లుతుందా?







 

Comments

Post a Comment