తెలుగు సినీ పరిశ్రమలో పుట్టి పెరిగిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన తీరుతో తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా వ్యవహరిస్తున్నాడని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన తీవ్ర విమర్శలపై వర్మ స్పందించాడు. ఈ మేరకు అవింద్ విమర్శలకు సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ వేదికగా సమాధానం ఇచ్చాడు. ‘‘పవన్ కల్యాణ్ విషయంలో అల్లు అరవింద్ చాలా వేగంగా స్పందించారు. శ్రీరెడ్డి విషయంలో నెల రోజులుగా చిన్న కామెంట్ కూడా చేయలేదు. దగ్గుబాటి సురేశ్‌తో మాట్లాడి అభిరామ్ విషయంలో డబ్బులు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పాను. నేను ఇప్పిస్తానన్న రూ.5 కోట్లతో పవన్‌కు ఎలాంటి సంబంధం లేదు. నా రొమ్ము నేనే గుద్దుకున్నాను తప్ప ఇంకెవరి రొమ్ము గుద్దలేదు. పవన్ ఆకాశమంత ఎత్తు ఉన్న సూపర్‌స్టార్, లీడర్. ఆయన స్థాయి తగ్గించడానికి నేనెవరని? ఎంతటివాడిని? నూటికి నూరు శాతం నేను చేసింది క్షమించరాని తప్పే. అరవింద్‌కు, పవన్‌కు, ఫ్యాన్స్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నా. మళ్లీ ఎప్పుడూ పవన్ మీద, అరవింద్ కుటుంబ సభ్యుల మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టను’’ అని వర్మ పేర్కొన్నాడు. Source Eenadu
Comments
Post a Comment