ఒక్క సారి ఆలోచించండి

ఒక్క సారి ఆలోచించండి 

ఒక వ్యక్తి చికెన్ వ్యాపారం చేసేవాడు. పంజరంలో కోళ్ళను పెట్టి ,వినియోగదారుడు చికెన్ కొరకు రాగానే పంజరం నుండి ఒక కోడిని తీసి దాని గొంతుకోసి మాంసం అమ్మేవాడు.
తాను పంజరంలోకి ఎపుడు చేయిపెట్టి కోడిని తీయబోయినా, అందులోని కోళ్ళు అరిచేవే కాదు. తమకుతాము తలొంచుకుని ధాన్యం తింటుండేవి. అయితే ఏ కోడినైతే ఆ కసాయివాడు పట్టుకుంటాడో అది మాత్రం అరిచి గగ్గోలు పెట్టేది. మిగిలినవి తమకు సంబంధం లేనట్లు ప్రశాంతంగా ఉండేవి. తమకేమీ పట్టనట్లుండేవి. సాయంత్రానికల్లా అన్ని కోళ్ళు మాంసం ముక్కలుగా మారిపోయేవి.
ఒకరోజు ఆ కసాయివాడిని అతడి స్నేహితుడు ' నువ్వు ఆ కోళ్ళను గొంతు కోస్తావని తెలిసినా ,అవన్నీ ఎలా ప్రశాంతంగా ఉంటాయి? ' అని ప్రశ్నించాడు. అందుకు కసాయివాడు ' నేను ఈ కోళ్ళకు మీరంతా గొప్పవారు. మీరుగానీ, మీ జాతి గానీ ఎప్పటికీ నశించదు. ప్రపంచంలో మీదే శ్రేష్ఠ జాతి. మీరు హాయిగా ఉండండి. ఏ కష్టమూ మీకు రాదు. అలాంటిదేదైనా వచ్చినా అది మీ పక్కింటి వారికి వస్తుందే తప్ప మీకు రాదు ' అని చెబుతుంటాను.ఇవి అదే భ్రమలో తమకేమీ కాదు. ఏమైనా జరిగినా అది తన ప్రక్కింటివాడికి అవుతుందంతే అనుకుంటాయి ' అన్నాడు.
ఈ కథ ఈ దేశంలోని హిందువులకు సరిగా అన్వయిస్తుంది.
లవ్ జిహాద్ అయినా, అక్రమ చొరబాట్లు అయినా, రోహింగ్యాలైనా, ISIS అయినా ఆలోచన చేసేంత సమయం హిందువుల వద్ద లేదు. వ్యాపారి అయితే తమ వ్యాపారం బాగా జరిగి , ఉద్యోగి అయితే తన పై అధికారి తనకు ఎక్కువ పని అప్పగించక, జీతం సరిగా ఇస్తే చాలని, తనూ, తన కుటుంబం ప్రశాంతంగా ఉంటే చాలని భావిస్తున్నారు.
భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని మాత్రం గుర్తించడం లేదు, గుర్తించడానికి ఖాళీలేదు, ఖాళీ చేసుకోరు కూడా!
ఓ హిందూ మేలుకో .....

Comments