నాకు తెలిసిన ఒక హీరో గారి ఫ్రెండ్ కథ

ఇక్కడ, హీరో గారి ఫ్రెండ్ అని ఎందుకు అన్నానంటే, యీయన గారు, హీరో కి తోక్కువ, సైడ్ క్యారెక్టర్ కి ఎక్కువ. తన ఫ్రెండ్స్ ఎవరయినా ప్రేమలో పడితే, ఈయన గారు మిగిలిన ఫ్రెండ్స్ కలిసి , అమ్మాయిని అబ్బాయిని వేరే వూరికి తీసుకేని వెళ్లి దగ్గర ఉండి మరి పెళ్లి చేయిస్తారు.

అలాగే, మన హీరో గారు కూడా ప్రేమలో పడ్డారు, అమ్మాయి తో నువ్వు లేక పొతే చచ్చి పోతాను అన్నారు. సిటీ మొత్తం బైకు లో తిరిగారు. చివరకు, అమ్మాయిని వదిలేసారు. కారణాలు ఏమయినా కావచ్చు.

ఇక్కడ నీను చెప్పా దలచుకున్నది ఏమిటంటే, ఆ అమ్మయిని వదిలేసినా తరువాత, కొంత కాలానికి, తను దగ్గర ఉండి పెళ్లి చేసిన స్నేహితుడి తల్లితద్రులు ఇతనిని కలిసినారు. వారికి, మన హీరో గారు(?) కూడా ప్రేమలో పడ్డారని తెలుసు గాని, ఆ అమ్మాయిని వదిలేసినారని తెలియదు. వారు, ఈయనని, పెళ్లి ఎప్పుడని అడిగినారు.

తన ఇంటిలోని వారు, తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, త్వరలోనే పెళ్లి జరుగుతుందని చెప్పారు.

దానికి వారు ఆశ్చర్యంగా , మరి నీవు ప్రేమిస్తున్న అమ్మాయిని సంగతి ఏమిటని అడిగినారు.

తను ప్రేమ పెళ్లి చేసు కోవడం ఇంటిలోని వారికి ఇష్టం లేదు అని, వారిని ఎదిరించి ప్రేమ పెళ్ల్లి చేసుకుని వారిని బాధ పెట్టం తనకు ఇష్టం లేదని చెప్పాడు.

అంటే, వారికి భలే పాయింట్ దొరికినది. వారు, 'ఎం బాబు, మరి మా అబ్బాయిని వేరే వూరు తీసుకోని వెళ్లి, ప్రేమ పెళ్లి చేయించి నప్పుడు, వాడి తల్లి తండ్రు లు అయిన మీము నీకు గుర్తు రాలేదా' అని అడిగినారు.

Comments

Post a Comment