మా ఫ్రెండ్ ఒకరు ఒక పేరు మోసిన ఎలక్ట్రానిక్ పరికరాల షాప్ కి వెళ్ళినాడు. అక్కడ, తనకి ఒక ఫ్రిడ్జ్ నచ్చినది. దాని ధర సుమారు రూ 16000 /- అని ఉన్నది. దానిని, తన భార్య కి చూపించడానికి మొబైల్ లో ఫోటో తీసి నాడు.
రెండు రోజుల తరువాత, తను, మరొక ఫ్రెండ్ అదే షాప్ కి ఆ ఫ్రిడ్జ్ చూడడానికి వెళ్ళినారు. చిత్రంగా, దాని వేల మారిపొయినది. ఆ ఫ్రిడ్జ్ మీద, అ షాప్ వారు, MRP రూ 19000/- అని, ఆఫర్ లో రూ 17500/- కి ఇస్తున్నామని రేట్లు పెట్టినారు. ఆ సమయములో వేరే సేల్స్ అమ్మాయి ఉన్నది.
మా ఫ్రెండ్ కి ఒక్క నిమిషము మైండ్ బ్లాక్. తేరుకొని, తన దగ్గర వున్నా మొబైల్ నుండి తను తీసిన ఫోటో ని, అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ కి చూపిస్తే, ఆ అమ్మాయికి ఏమి చెప్పాలో తెలియక, ఆ ఫ్రిడ్జ్ మీద ఉన్న ఆ రేట్లు కాగితాలు తీసి వేసి అక్కడినుండి వెళ్లి పోయినది.
ఒక్క సారి ఆలోచిస్తే మనకే అర్థము అవ్వుతుంది ఈ డిస్కౌంట్ లు, ఆఫర్ లు ఎలా పని చేస్తాయో.
Comments
Post a Comment