నష్టాల లో ఉన్నమని ఏడుస్తున్న నిర్మాతలు, ఒక్క సారి ఆలోచించండి

చాల మంది నిర్మాతలు తక్కువ ఖర్చు తో సినిమాలు తీసి లాభాలు తెచ్చు కోవడము మానేసి, గొప్పల కోసము, అనవసర ఖర్చులు చేసి, నిర్మాణ వ్యయము పెంచుకుని, తరువాత, సినిమా ప్లాపు ఐతే, పరచి మూలముగా నష్టపోతున్నామని గోల పెడుతున్నారు.

అసలు సినిమా కత బాగుంటే, వీరు రిచ్ గా, తీయక పోయినా చూస్తారు. కానీ, ఇప్పుడు వీరు, బడ్జెట్ ఎంత పెడదాము అని ఆలోచిస్తున్నారు తప్ప, కత మీద ఆలోచించడము లేదు.

కొంతమందికి, పరాయి దేశం లో షూటింగ్ చేయడము ఫేషన్ . సినిమాలలో, 99% సినిమాలు, ఇక్కడే, ఆంధ్ర ప్రదేశ్ లోనే తీయవచ్చు. దీని మూలముగా, వారికి నష్టాలు చాలా వరకు తగ్గును.

ఇక కొంతమంది, అవసరము ఉన్న లేక పోయినా, కోట్లు పెట్టింగ్ సెట్టింగ్లు వేస్తారు(గొప్పలు చెప్పుకోవడానికి)

ఒక్క సినిమా హిట్టు కాగానే, అదే ఫార్ముల ఫాలో అయ్యిపోవడము, అదే టైపు స్టొరీ లైన్స్ మీడ్స్ సినిమా తీయడము లేదా, పావలా కూడా చేయని హీరో లకి కోట్లు పెట్టి సినిమాలు తీయడము. ఎంతమంది స్టొరీ బాగా లేక పొతే, ఈ పావలా హీరో లని చూడడానికి థియేటర్ కి వెళతారు.

Comments