ఎవరబ్బా సొమ్మని...
ప్రపంచ కప్ గెలచిన టీం ఇండియా కి, ఇష్టానుసారం గా డబ్బులు నజరానా గా ఇవ్వడానిని సవాలు చేస్తూ, కోర్టు లో పరాజ ప్రయోజనాల వాజయం దాఖలు అయ్యినది.
టీం ఇండియా ప్రపంచ కప్ గెలచినందుకు ఒక అభిమానిగా సంతోషముగా ఉన్న, వారికి ఇలా కోట్లు పంచడము మాత్రము ఏమి బాగా లేదు. ఇది వారి డబ్బు కాదు, ప్రజల ముక్కు పిండి పన్నుల రూపములో వాసులు చేసిన కష్టార్జితం. ఆ సొమ్ముని ప్రజల అవసరాలకి ఉపయోగినచాలి కాని, విలాసవంతమైన ఆటలకు కాదు.
అవును మరి, వారికి కోట్లు కుమ్మరిస్తున ఈ పాలకులు, దేశం కోసం ప్రానలర్పించే సైనికులకు గాని, తిండి పెట్టె రైతులకు కాని, గుడ్డ ఇచ్చే చేనేత వారికి గాని ఏమిఅయినా సహాయము చేయడానికి చేతులు రావు.
విలాసాలు అందిచే వారికి ఉన్నవిలువ నిత్యావసరాలు తీర్చేవారికి లేదు.
yes i agree with you.
ReplyDelete