ప్రపంచ కప్ గెలుపు - ఎన్నాళ్ళో వేచిన ఉదయం


ప్రపంచ కప్ గెలుపు - ఎన్నాళ్ళో వేచిన ఉదయం (లేదా రాత్ర లేదా రోజా?)

ఏది ఏమియినా, ఈ గెలుపు కోసం చాల మంది అభిమానులు లాగానే, మీము కూడా 28 సంవత్సారాలు ఎదురు చూసాము. మేము, క్రికెట్ చూడడం 1986 లో చూడడం మొదలుపెట్టాము). 1987 లో ఇంగ్లాండ్ చేతిలో సెమి ఫైనల్ ఓడిపోయినప్పుడు, చిన్న పిల్లలము కనుక పెద్ద గా బాధ పడలేదు.

1992 మన వారి ప్రదర్శన అంతంత మాత్రమె అయినా, సగటు అభిమానిగా, వేలవక పోతార అని చిన్న ఆశ. కాని నిరాశే ఎదురు అయ్యినది.
    
1996 లో, సచిన్ ఫారం చూసి, తప్పక గెలుస్తామని అనుకున్నాము. కాని, కొలకత్తా లో సెమి ఫైనల్ ఓడిపోయిన్నపుడు, కళ్ళలో నీళ్ళు పెటుకోవడం తప్ప ఏమి చేయలేక పోయినాము(అయినా మేము చేయగలిగినది ఏమి ఉన్నదది కనుక)

1999 లో మళ్లీ నిరాశే, కనీసము సెమి ఫైనల్ కే కూడా వెళ్ళలేదు.

2003 లో, ఫైనల్ లో ఓడిపోయినప్పుడు, మా కళ్ళ ముందే మా కళల సౌధం కూలి పోయినట్టు అనిపించినది. 

2007.ప్రపంచ కప్ గురించి ఎంత తక్కు మాట్లాడు కొంటె అంత మంచిది. సచిన్, గంగూలి , ద్రావిడ్ కలిసి 1000 ఒన్ డే మ్యాచ్ లు ఆడినా, కానిసము తదుపరి రౌండ్ లోకి కూడా చేర లేక పోయినాము.

ఇలా ఆరు సార్లు మాకు నిరాశే ఎదురు అయ్యినది.

2011 లో, నిన్న, మన వారు కప్ గెలవడము చూసిన తరువాత మేము ఇంతకన్నా ఏమి అనగలము

 
ఎన్నాళ్ళో వేచిన ఉదయం (లేదా రాత్ర లేదా రోజా?)

Comments