జగన్ గారి పార్టి మొదలు అయ్యినది, ప్రజలారా జాగ్రత్త
అనుకున్నట్టు గానే, జగన్ గారు YSR కాంగ్రెస్ పార్టి ని నిన్న తన తండ్రి సమాధి వద్ద, తమ పార్టీ జండా ను ఆవిస్కరించి ప్రారంభించి నారు.
ఆయన పార్టి ఉద్దేశ్యము పేద ప్రజల కళ్ళలో ఆనదము చూడడమట. ఎంత మంది అందాన పడతారో తెలియదు గాని, ఆయనకు ఆయన బంధు వర్గానికి మాత్రము...
అసలు మాకో డౌట్, ఇప్పుడు YS ని ఎంతమంది గుర్తు ఉంచు కున్నారు, ఎంతమంది ఆయనను చూచి ఈయనకు ఓటు వేస్తారు. బహుసా ఈయనకు కూడా ఆసంగతి తెలిసి ఉండవచ్చు. అయినా పార్టీ ఎందుకు మొదలుపెట్టారంటే...
ఒక చిన్న కధ చేప్పుతాము... బాగా క్లియర్ అవుతుంది
మా చిన్నపుడు. మా వూరి లో ఒక రౌడి షీటర్ ఉండేవాడు. ఊరిలో ఎటువంటి ఎన్నికలు జరిగినా తను పోతిక్ చేసేవాడు. ఒక రోజు మా బాబాయి ని అడిగితె, వాడు ఎన్నికలలో పాల్గొనకపోతే వాడిని, పోలీసులు తీసుకొని పోతారని, పోటి చేసినాడు కనుక, ఎన్నికల ప్రచారములో పాల్గొనే నెపము తో ఊరిలో ఉంటాడు.
ఇప్పుడు, జగన్ గారు గెలిచినా గెలవక పోయినా, తమ పార్టీ పదవిలోకి రాక పోయిన, తాతల నాటి వేల కోట్ల ఆస్తి (???) , చేతిలో మీడియా ఉన్నది కనుక, పార్టీ ఉన్నంత కాలము తనను ప్రభుత్వము పెద్ద గా ఇబ్బంది పెట్ట దు . పెడితే ఎలాగో మీడియా ఉన్నది. తన తండ్రి హయము లో తన తండ్రి కి ఉన్న శత్రువు లు ఇప్పుడు తనకు ఇబ్బంది కలిగించి తన తండ్రి మీద ఉన్న కక్ష తీరుకున్తున్నారు. అవును మరి "తల్లి తండ్రుల పాపలు పిల్లలకు తగులుతాయి"
కనుక, పార్టి పెట్టి, ముందు తన ఆస్తిని కాపాడు కోవచ్చు. చేతిలో డబ్బు ఉన్నది కనుక, ఏదో ఓకే రోజు, మిత్ర భేదము లో తనకు ఎక్కువ సీట్లు రావచ్చు, తన కలల CM పదవి దొరక వచ్చు. కాని ప్రస్తుతానికి మాత్రము తన ఆస్తి సేఫ్.
Valid point.
ReplyDelete