జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

సంసార సాగరం నాదె

సన్యాసం శూన్యం నావే

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

కవినై కవితనై భార్యనై భర్తనై

కవినై కవితనై భార్యనై భర్తనై

మల్లెల దారిలో మంచు ఎడారిలో

మల్లెల దారిలో మంచు ఎడారిలో

పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల

నాతో నేను అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ

వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం

కలల్ని కధల్ని మాటల్ని పాటల్నిరంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై

కంటను మంటను నేనై

మింటికి కంటిని నేనై

కంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై

వెన్నెల కూతల మంటను నేనై

రవినై శశినై దివమై నిసినై

నాతో నేను సహగమిస్తూ

నాతో నేనే రమిస్తూ

వంటరినై ప్రతినిమిషం

కంటున్నాను నిరంతరం కిరణాల్ని

కిరణాల హరిణాల్ని

హరిణాల చరణాల్ని

చరణాల చలనాన

కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె

గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె

నా హ్రుదయమే నా లోగిలి

నా హ్రుదయమే నా పాటకి తల్లి

నా హ్రుదయమే నాకు ఆలి

నా హ్రుదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది


Comments

  1. baaboy... aapu ee paata... Please... neeku dannam pedathaa... Please...

    ReplyDelete

Post a Comment