సమాచారం యొక్క విలువ (Power of Information)

సమాచారం యొక్క విలువ (Power of Information)
ఈ మధ్య ఆఫీసు వారందరమూ సరదాగా ఒక రోజు పిక్నిక్ కే వెళ్ళినాము. ముందుగా అనుకున్న చోటికి అనుకున్న సమయానికి చేరినాము. అక్కడి నుండి వేరొక చోటికి బయలుదెరినాము. 4 కిలో మీటర్లలో అనుకున్న ప్రదేశానికి చేరతామనగా,  వేరొక వూరు వచ్చినది. అక్కడ 12 సంవ్సరాలకు ఒక సారి జరిగే జాతర ఒకటి జరుగుచున్నది. ఆ జాతర చూడడానికి అక్కువ మంది భక్తులు వస్తారని, వాహనాలు అన్నింటిని ట్రాఫిక్ వారు 4 గంటల పాటు ఆపివేసినారు.

భాకుతలు ఇబ్బంది కలగకుండా అలాగా ఆపడములో తప్పు లేదు కాని, జాతర జరుగుతున్న వూరిలోనికి రావడానికి ముందే వేరే వూరిలో ఏదయినా  బ్యానర్ కట్టినట్టయితే, జాతరకు వెళ్ళేవారు తప్ప, ఆ వూరి మీదుగా వేరే వూరు వెళ్ళాలనఉకున్నవారు వేరే ఏర్పాటు ఏమయినా చేసుకుంటారు కదా. అటువంటిదేమి జరగలేదు. ఈ చిన్న సమాచారము మాకు దొరకక పోవడము వలన, మేము 4 గంటల పాటు, ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేవరకు అక్కడే ఉండవలసి వచ్చినది

ఇటువంటివి ఇక్కడే కాదు, చాల చోట్ల జరుగు చున్నవి.

అక్కడ, ఆ సమయములో, Dr జయ ప్రకాష్ నారాయణ గారి మాటలు గుర్తుకు వచినవి. "చాల మంది  ప్రభుత్వ ఉద్యోగులకు బుర్ర పనిచేయదని (మంచి  వారు నన్ను క్షమించాలి)"



Comments