అందరు రైతు బిడ్డలే. కానీ...?

అందరు రైతు బిడ్డలే. కానీ...?

మొన్న బాబు గారు రైతులకు "నేను రైతు బిడ్డనే అని" ప్రజలకు లేఖ రాసారు.

నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కుడా "నేను రైతు బిడ్డనే" అన్నారు.

రేపు జగన్ గారు దీక్ష మొదలు పెట్టినప్పుడు, ఆయన కుడా "నేను రైతు బిడ్డనే???" అన్న ఆశ్చర్య పో నక్కరలేదు

రైతు బిడ్డ అయిన బాబు గారు, 9 సంవత్సరాల క్రితం, "వ్యసాయం లాభ సాటి కాదు" అన్న మాట ఆయనను రైతు వ్యతిరేకి ని చేసినవి. ఆ ముద్ర ను చెరుపు కోవడానికి బాబు గారు పడ్డ కష్టాలు ఎన్నో?

ఇప్పుడు బాబు గారి కి గొప్ప అవకాశం దొరికినది ఈ అకాల వర్షాల రూపం లో. ఇంకేముంది, దీక్ష మొదలు పెట్టేసారు. ఆయనకు ETV మరియు ఈనాడు పేపర్ తోడూ. రామోజీ రావు గారు, బాబు గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు తన మీడియా ద్వార.

రైతులకు న్యాయం జరిగేవరకు తన దీక్ష కొనసాగిస్తారట. ఈ దీక్ష వలన, అటు తెరాస కి ఇటు జగన్ కి కూడా సమస్యలే.

జగన్ చేస్తానన్న 48 గంటల దీక్ష కి విలువ ఉండదు. తెరాస వారు హైలైట్ చేద్దామనుకున్న డిసెంబర్ నేలని ప్రస్తుతం మీడియా వారు పట్టించుకోవడం లేదు.

దీక్ష మొదలు పెట్టి నప్పుడే ఆయనకు తెలుసు, రెండు లేక మూడు రోజుల కంటే దీక్ష జరగదని, ప్రభుత్వం తనను అరెస్ట్ చేస్తుందని. ఆసుపత్రి లో, డాక్టర్లు ఎలాగో శరీరానికి కావలసిన పోషకాలు మందుల రూపం లో ఇస్తారని.

ఒక విషయం అర్థం కావడం లేదు. ఒక వేళ ప్రభుత్వం దిగివచ్చిన, ఏదైనా పరిహారం ప్రకటించిన, అది నిజంగా రైతులకు చేరుతుంద లేక మధ్య లో పంది కొక్కులు మింగేస్తాయా?

ప్రజలు ఎంతవరకు బాబు గారి దీక్ష ని నమ్ముతున్నారు?

రైతులకు మేలు జరిగిన జరగక పోయిన మీకు మాత్రం ఫుల్ publicity.

Comments