జ‌ర్న‌లిస్ట్ సంఘాలూ ముందు వీటికి స‌మాదానం చెప్పండి

Source : Social Media

ప‌వ‌న్ క‌ళ్యాన్ వ్యాక్య‌ల‌పై ఆగ్ర‌హంతో ఊగిపోతున్న జ‌ర్న‌లిస్ట్ సంఘాలూ ముందు వీటికి స‌మాదానం చెప్పండి
1. జ‌ర్న‌లిస్ట్ యూనియ‌న్లు.. జ‌ర్న‌లిస్ట్ సంఘాలు ఉంది.. జ‌ర్న‌లిజం విలువ‌లు, జ‌ర్న‌లిస్టుల హ‌క్కులు కాపాడ‌టానికా లేక ఛాన‌ళ్ల‌ యాజ‌మాన్యాల‌కు కొమ్ముకాయ‌డానికా...
2. టీవీ9,టీవీ5, ఏబీన్.. మీడియాలో భాగ‌మా.. లేక అవే మీడియానా....
అవి మీడియాలో ఒక భాగం మాత్ర‌మే అయితే మెత్తం మీడియాను ప‌వ‌న్ వ్య‌తిరేకించిన‌ట్లు జ‌ర్న‌లిస్ట్ ల‌ను అవ‌మానించినట్లు ఎందుకు చిత్రీక‌రిస్తున్నారు...

3. జ‌ర్న‌లిస్ట్ యూనియ‌న్లు సంఘాలు ఉంది జ‌ర్న‌లిజం విలువ‌లు కాపాడేందుకు అయితే... నానాటికీ ప‌త‌న‌మ‌వుతున్నజ‌ర్న‌లిజ‌పు విలువ‌ల‌ను కాపాడేందుకు ఏ రోజైనా స‌మావేశ‌మ‌య్యారా...
4. అస‌త్యాలు ప్రచారం చేస్తున్న కార‌ణంగా ఈ రోజు రోడ్డెక్కిన ఈ జ‌ర్న‌లిస్ట్ సంఘాలు సీవీఆర్ న్యూస్ 6నెల‌లు జీతం చెల్లించ‌కుండా జ‌ర్న‌లిస్ట్ ల‌ను వేదించిన‌పుడు, ఎక్స్ ప్రెస్ ఛాన‌ల్ లో జీతం అడిగినందుకు ఒక సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ని ఛాన‌ల్ లోనే కొట్టిన‌పుడు, కొన్ని ఛాన‌ళ్ల సిబ్బంది జీతాల‌కోసం ఆయా ఛాన‌ల్ల ముందు ధ‌ర్నాలు చేసిన‌పుడు, అన్ని ఛాన‌ళ్ల‌లో కార్మిక నింబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా సిబ్బందిని తొల‌గిస్తున్న‌పుడు ఎందుకు వ‌చ్చి పోరాడ‌లేదు.. ఈ సంఘాలు ఉంది జ‌ర్న‌లిస్ట్ ల హ‌క్కుల పరిర‌క్ష‌ణ కోస‌మా.. లేక మీడియా యాజ‌మాన్యాల‌కు కొమ్ముకాయ‌డానికా...
5. టీడీపీ కార్య‌క‌ర్త‌లు సాక్షిపై దాడి చేసిన‌పుడు, సాక్షిని బాయ్ కాట్ చేయాల‌ని సాక్ష్యాత్తూ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించిన‌పుడు, విప‌క్ష‌నేత అంద‌రి విలేఖ‌రుల ముందే ఆంధ్ర‌జ్యోతి విలేఖ‌రిని అవ‌మానించినుపుడు ఎక్క‌డి పోయాయి ఈ జ‌ర్న‌లిస్ట్ సంఘాలు, నాయ‌కులు
6. అకార‌ణంగా ఎన్టీవీని ఆంధ్రాలో బ్యాన్ చేసిన‌పుడు, బ్యాన్ ఎత్తివేయ‌డానికి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ను ఉద్యోగం నుంచి తొలగించాల‌ని టీడీపీ ప్ర‌తిపాధ‌న పెట్టిన‌పుడు ఏమయ్యింది ఈ జ‌ర్న‌లిస్ట్ ల ఐక్య‌త‌
7. పార్టీకో ఛాన‌ల్.. కులాల వారిగా వ‌త్తాసు ప‌ల‌క‌డం మీడియాలో లేదు అని ఏ ఒక్క జ‌ర్న‌లిస్ట్ అయినా త‌న కుటుంబ స‌భ్య‌లు మీద ఒట్టు వేసి చేప్ప‌గ‌ల‌రా.... సినిమాల్లో బూతులు ఉంటే సెన్సార్ ఉంది.. మరి అవే బూతులు మీడియాలో వ‌స్తే.. ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఏం ఉంది...
8. మీడియాపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను గుర్తించ‌కుండా.. ఆరోప‌ణ‌లు చేసిన‌వారిపై రాజ‌కీయ నాయ‌కుల్లా ఎదురుదాడి ఎవ‌రికి కొమ్ముకాయ‌డం కోసం...
9. డ‌బ్బులు తీసుకుని వ‌ర్త‌లు రాసిని ఎంత మంది జ‌ర్న‌లిస్ట్ ల‌పై నిషేదం విధించారు.. ఛాన‌ల్ల‌లో మ‌హిళా యాంక‌ర్లుల‌కు జ‌రుగుతున్న వేధింపుల‌పై ఎప్పుడైనా ఈ జ‌ర్న‌లిస్ట్ సంఘాలు స్పందిచాయా...
మీడియాపై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు, ఆగ్రహావేశ‌ల‌పై ఇక‌నైనా ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి.. జ‌ర్న‌లిస్ట్ ల‌ను జీతాలు ఇవ్వ‌కుండా వేధించే ఛాన‌ళ్ల‌ ప‌నిప‌ట్టాలి.. మ‌హిళా యాంక‌ర్ల‌ను వేధించే యాజ‌మాన్యాల‌ను క‌ఠినంగా శిక్షించాలి అంతే కానీ అధికార‌పార్టీల‌కు జ‌ర్న‌లిస్ట్ సంఘాలు కూడా వ‌త్తాసు ప‌లుకుతూ రాజ‌కీయా పార్టీల్లా రాజ‌కీయం చేయ‌కూడ‌దు... ద‌య‌చేసి జ‌ర్న‌లిజాన్ని కాపాడండి.

Comments